ఇప్పుడు టాలీవుడ్ లో అంతా అయోమాయం చోటుచేసుకుంది. జనవరి 7న వస్తుందనుకున్న ప్యాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ విడుదల వాయిదాపడడంతో అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా కంగుతిన్నాయి. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమైన ట్రిపుల్ ఆర్ విడుదల కోసం ప్రపంచ సినీ ప్రేమికులు కొంత కాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా విడుదలకు పకడ్భంది ఏర్పాట్లు చేసారు. అయితే.. అంతా ఒకే అనుకుంటున్న సమయంలోనే ఈ చిత్రానికి కరోనా, ఒమిక్రాన్ ల దెబ్బ తగిలి విడుదల వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు కరోనా మూడో దశ ప్రారంభమయింది. కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మహరాష్ట్రలో అయితే.. కరోనా ఫలితంగా తొమ్మిది గంటలకే అన్నీ సర్దేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.…