అచ్చ తెలుగమ్మాయికి అవకాశాలు వెల్లువ… రూప కొడువాయూర్ …పేరు ఏదో మలయాళీ అమ్మాయిలా ఉన్నా.. అచ్చమైన తెలుగు అమ్మాయి. చక్కని తెలుగు మాట్లాడే అందాల ముద్దుగుమ్మ రూప. పేరులోనే కాదు రూపంలో కూడా అందమే. చక్రాల్లాంటి కళ్లతో , బుగ్గలపై డింపుల్స్ తో, చందమామ నవ్వినంత స్వచ్చంగా కనిపించే ఈ అమ్మాయి వెండితెరపై అలరిస్తోంది. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంతో క్లాసికల్ డ్యాన్స్ ను నేర్చుకుంది. తరువాత ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయింది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన రూప తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. 2020లో వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ భామ సొంతఊరు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ. తన మొదటి సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అయినప్పటికీ కేవలం తన నటనాప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అలాగే వృత్తి…