మారుతి వదిలిన ‘మాయ‌’ టీజర్

maruthi launches maaya movie teaser

ప్రవాస భారతీయురాలైన రాధిక జయంతి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘మాయ’. సంధ్య బయిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ పోషించ‌గా, రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా ఇత‌ర పాత్రధారులుగా నటించారు. రేస‌న్ ప్రొడ‌క్ష‌న్స్‌, విఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకాల‌పై గోపికృష్ణ జ‌యంతి నిర్మించారు. ప్ర‌ముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ డ‌స్టిన్ లీ ఈ చిత్రానికి వ‌ర్క్ చేయ‌డం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రీ లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా ‘మాయ’ ఫ‌స్ట్‌లుక్‌ని ఇటీవ‌ల ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడు‌ద‌ల ‌చేశారు. ఈ ఫ‌స్ట్‌లుక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌డంతోపాటు సినిమా మీద క్యూరియాసి‌టీని పెంచి ప్రేక్ష‌కుల‌ని ఇంప్రెస్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ… కొత్త లేడి డైరెక్టర్ రాధిక జయంతి తీసిన మాయ…