ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను – ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగం లో ఆయనకు ఈ ‘అకాడమీ పురస్కారం’ లభించింది. తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతం తో – భారత దేశపు ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం యథాతథం గా పాడడం తో పాటు, మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతం లో, తెలుగు తాత్పర్య సహితం గా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, ‘భారతీయ గాయకుడి తొలి సంగీత భరిత…