రాంగోపాల్ వర్మ తాజా సినిమా ‘శారీ’ టైటిల్ కి ‘టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’ అనే లాగ్ లైన్ తో పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయనున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో అర్జీవి ఆర్వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘శారీ’ని ప్రముఖ బిజినెస్ మాన్ రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఆంధ్ర, తెలంగాణ రాష్టాలలో వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా తెలుగులో విడుదల చేయడానికి ప్రముఖ పంపిణీ దారుడు ముత్యాల రాందాస్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్నారు. పలు నిజజీవిత సంఘటనల మేళవింపుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా ‘శారీ’ చిత్రం రూపొందుతోంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి పిచ్చివాడై ఆమెతో ప్రేమలోపడి ఎంతో…