కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం? క్వశ్చన్ మార్క్. హీరోయిన్ ఓరియెంటెడ్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆదాశర్మ మెయిన్ లీడ్ లో నటించింది. సంజయ్, అభయ్, భానుశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆఖరి దశలో ఉన్నాయి. ఇటీవల మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా లాంచ్ చేసిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ చిత్రంలోని పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ “మా శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై ఆదా శర్మ హీరోయిన్…
Tag: release details
సంక్రాంతి బరిలో రానా ‘అరణ్య’
హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి తెలుగు, హిందీ, ఇతర భాషల్లో సాధించిన వరుస విజయాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఆయన నెగటివ్ రోల్ పోషించిన మునుపటి హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఇప్పుడు తెలుగులో ‘అరణ్య’ పేరుతో విడుదలవుతున్న బహు భాషా చిత్రం ‘హాథీ మేరే సాథీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవనున్నది. మంగళవారం ఆవిష్కరించిన ఒక సరికొత్త పోస్టర్, మోషన్ వీడియో ద్వారా ఈ సినిమా 2021 సంక్రాంతికి విడుదలవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ పోస్టర్‌లో ఒక వైపు ఒక విరిగిన గోడ, రానా, విష్ణు విశాల్ కనిపిస్తుండగా, మరోవైపు ఏనుగులు కనిపిస్తున్నాయి. వృక్షాలు, అడవులను సంరక్షించమనే మెసేజ్‌ను…