రవితేజ 67వ చిత్ర ప్రీ లుక్‌ వచ్చేస్తోంది

raviteja 67th film pre look details out

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, ‘రాక్ష‌సుడు’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను నిర్మించేందుకు ప్ర‌ముఖ నిర్మాత స‌త్య‌నారాయ‌ణ కోనేరు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘ఆర్‌టి67’ (ర‌వితేజ 67వ చిత్రం) ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను శ‌నివారం విడుద‌ల చేశారు. ఇందులో స్టైలిష్ డాన్స్ చేస్తున్న‌ట్లున్న ర‌వితేజ షాడో ఇమేజ్‌ను మ‌నం చూడొచ్చు. ఈ హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్ మూవీ ముహూర్తం వేడుక ఆదివారం జ‌ర‌గ‌నున్న‌ది. అదేరోజు ఉద‌యం 11:55 గంట‌ల‌కు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి నాయిక‌గా న‌టించే ఈ చిత్రంలో డింపుల్ హ‌య‌తి సెకండ్ హీరోయిన్‌గా ఎంపిక‌య్యారు. తారాగ‌ణం:ర‌వితేజ‌, మీనాక్షి చౌధ‌రి, డింపుల్ హ‌య‌తి సాంకేతిక బృందం:ద‌ర్శ‌కుడు: ర‌మేష్ వ‌ర్మ‌నిర్మాత‌: స‌త్య‌నారాయ‌ణ…

‘క్రాక్‌’ స్పెష‌ల్ సాంగ్‌లో వర్మ పోరి

rgv thriller heroine apsara rani item song in krack movie

మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్‌’ షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతోంది. ప్ర‌త్యేకంగా వేసిన ఒక సెట్లో ప్ర‌స్తుతం ర‌వితేజ‌, అప్స‌రా రాణిల‌పై ఒక ఐట‌మ్ సాంగ్ చిత్రీక‌రిస్తున్నారు. ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూర్చిన ఈ మాస్ సాంగ్‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాశారు. ఈ సాంగ్‌కు జాని మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. పేరుపొందిన త‌మిళ న‌టులు స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్లు పోషిస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకొనే అంశాల‌తో, ఉద్వేగ‌భ‌రితమైన‌ క‌థ‌, క‌థ‌నాల‌తో స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు ‘క్రాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.…