‘రావణాసుర’ మాములుగా వుండదు.. దద్దరిల్లుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో రవితేజ

Ravanasura telugu movie pre relese event

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ‘రావణాసుర’ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ .. దర్శకుడితో మాంచి సింక్ లో వుండి ప్రతి సెట్ చాలా…