క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. ఇందులో రావు రమేష్ కథానాయకుడు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ… అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా, సుకుమార్ విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫస్ట్ టికెట్ అల్లు అర్జున్ గారికి ప్రజెంట్ చేశారు. ‘టికెట్ ఎంత పెట్టి కొంటున్నారు?’ అని సుమ అడగ్గా… ”సుకుమార్ గారి సినిమా. కోటి రూపాయలు అయినా పెడతా” అని చెప్పారు అల్లు…