‘ప్రేమ’తో కూడిన కుటుంబ కధా చిత్రం ‘రంగ్ దే’. ఈరోజు చిత్ర కధానాయిక ‘కీర్తిసురేష్’ పుట్టినరోజు సంధర్భంగా ‘రంగ్ దే’ లోని ఓ చిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్. చిరునవ్వు లొలికిస్తూ ముగ్ధ మోహన రూపంతో కూడిన నాయిక చిత్రం ఆకట్టుకుంటుంది.ఇటీవలే కొద్ది విరామం అనంతరం చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమై నితిన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. షూటింగ్‌కు సంబంధించి సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల చివరి వారంలో చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, ‘ఇటలీ’లో పాటల చిత్రీకరణతో కొద్దిరోజులలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల అవుతుంది. యువ కథానాయకుడు ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ల తొలి కాంబినేషన్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ…