‘బాహుబలి’తో పాన్ ఇండియాని ‘ఆర్‌ఆర్‌ఆర్’ తో పాన్ వరల్డ్ ని షేక్ చేసిన దర్శధీరుడు రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ తరవాత మహేష్ తో సినిమాను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. మహేష్ సినిమాకు ఎలా లేదన్నా 3 ఏళ్లు టైం తీసుకునే ఆలోచనలో ఉన్న రాజమౌళి ఆ సినిమా తర్వాత నెక్ట్స్ సినిమా ప్లానింగ్ ఉంటుందని తెలుస్తుంది. మహేష్ తో చేసే సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుందని టాక్. అలా అయితే మరో ఏడాది అంటే నాలుగేళ్ల పాటు రాజమౌళి మహేష్ సినిమా ఉంటుంది. ఇక ఆ తర్వాత జక్కన్న తన లిస్ట్ లో ఒకరిద్దరి హీరోల పేర్లు ఉంచుకున్నాడు. అందులో ఎన్.టి.ఆర్, ప్రభాస్ లు ఉన్నారు. ఆల్రెడీ ఎన్.టి.ఆర్ తో సినిమాలు చేసిన రాజమౌళి మరో సినిమా ప్లానింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్క…