హైదరాబాద్ నడిబొడ్డున ‘పుష్ప’ వైల్డ్ ఫైర్ జాతర!

'Pushpa' wild fire fair in the heart of Hyderabad!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా నటిస్తూ సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్న చిత్రం ఇది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా సునీల్, ఫహాడ్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు కీలకపాత్ర పోషిస్తూ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. అలాగే ఈ చిత్రం నుండి విడుదలైన నాలుగు పాటలు కూడా ఎంతో వేగంగా ప్రేక్షకుల మన్నన పొందాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై…