నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా,డిస్ట్రిబ్యూటర్ గా, తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గా డా. ప్రతాని రామకృష్ణ గౌడకు తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. తన 35 ఏళ్ల సినీ ప్రయాణంలో, 41 చిత్రాలను నిర్మించి, 8 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 250 కి పైగా చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. మే 18వ తేదీ ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో “ఉమెన్స్ కబడ్డీ” అనే ఓ సరికొత్త నూతన చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే “దీక్ష’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని జూన్ నెలలో రిలీజ్ కు రెడీ అవుతోంది. కిరణ్, ఆలేఖ్య రెడ్డి, ఆక్సఖాన్, తులసి హీరో హీరోయిన్స్ గా నిర్మించిన దీక్ష…