ప్రియాంక జవాల్కర్ భలే ఛాన్స్ పట్టేసింది!

priyanka jwalkar bhale chance pattesindhi

‘అఖండ’ చిత్రంతో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో యమ బిజీగా దూసుకెళుతున్నారు. ‘అఖండ’ తోనే బాలయ్యలో మరింత హుషారు కనిపిస్తోంది. ఫుల్ ఎనర్జీతో ‘వీర సింహారెడ్డి’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. రెట్టింపు ఉత్సాహంతో ‘వీర సింహారెడ్డి’ రూపంలో సంక్రాంతి సమరానికి కూడా సిద్ధమయ్యారు. ఈ చిత్రం తర్వాత ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీ లీల నటించనుంది. అలాగే బాలకృష్ణ ఈ 108వ సినిమాలో ప్రియాంక జవాల్కర్ నటించబోతున్నట్లుగా తెలిసింది. బాలయ్యతో సినిమా చేసిన తర్వాత ఈమె ఫేట్ మారుతుందని సోషల్ మీడియా వేదికగా అందరూ తమ పోస్టులను పెడుతున్నారు. మొదట విజయ్ దేవరకొండ తో కలిసి ‘ టాక్సీవాలా;…