మీ సీట్ బెల్ట్స్‌ను గట్టిగా బిగించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ.. ప్రతి తెలుగు వారింటిలో భాగమైన 100% తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో అద్భుతమైన ఇంటిని భోజనంలాంటి థ్రిల్లర్ కామెడీ వెబ్ ఒరిజినల్ ‘భామా కలాపం’ మన ముందుకు రానుంది. ప్రముఖ నటి ప్రియమణి ఈ వెబ్ ఒరిజినల్ ద్వారా ఓటీటీ మాధ్యమంలోకి అడుగుపెడుతున్నారు. అభిమన్యు తాడి మేటి ఈ వెబ్ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ ఒరిజినల్ ఫిబ్రవరి 11న ‘ఆహా’లో ప్రసారమవుతుంది. ‘డియర్ కామ్రేడ్’ డైరెక్టర్ భరత్ కమ్మ షో రన్నర్. ఈ వెబ్ ఒరిజినల్ ట్రైలర్‌ను ‘లైగర్’ స్టార్ విజయ్ దేవరకొండ సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. ‘నేను వాసన చూసే కూరలో ఉప్పు ఎక్కువైందో.. తక్కువైందో చెప్పేస్తాను.. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. నేను…