మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ఆ సంస్థ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమా విడుదల తేదీని నేడు వెల్లడించారు. చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… ”డిసెంబర్ 20న మా సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. సెప్టెంబర్ మొదటి వారంలో చిత్రీకరణ అంతా పూర్తి చేశాం. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు సైతం తుది దశకు చేరుకున్నాయి. అతి త్వరలో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసి క్రిస్మస్ సెలవుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం. ఇటీవల…