ఈ నెల 20-21 తేదీలలో ఎకాగ్రా ఇంటర్ నేషనల్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాలులో ప్రారంభం కానుంది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో…. ఏకాగ్రా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ వైస్ చైర్మన్, సీనియర్ పాత్రికేయుడు, ఫిల్మ్ మేకర్, నంది అవార్డు గ్రహీత షరీఫ్ మహమ్మద్ మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి టోర్నమెంట్ జరుగుతోందని, భారీ మొత్తాన్ని 22 లక్షల 22 వేల 222 రూపాయలను ప్రైజ్ మనీగా విజేతలకు ఇవ్వ నున్నట్టు చెప్పారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి 5 వేల రూపాయలు ఎంట్రీ ఫీజుగా నిర్ణయించినట్టు చెప్పారు. ఇంటర్నేషనల్ మాస్టర్ లకు, గ్రాండ్ మాస్టర్లకు, వుమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్లకు, ఉమెన్ గ్రాండ్ మాస్టార్లకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని…
