సంక్రాంతి బరిలో రానా ‘అర‌ణ్య’

rana daggubati aranaya movie release details

హ్యాండ్స‌మ్ హంక్ రానా ద‌గ్గుబాటి తెలుగు, హిందీ, ఇత‌ర భాష‌ల్లో సాధించిన వ‌రుస విజ‌యాల‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఆయ‌న నెగ‌టివ్ రోల్ పోషించిన మునుప‌టి హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఇప్పుడు తెలుగులో ‘అర‌ణ్య’ పేరుతో విడుద‌ల‌వుతున్న బహు భాషా చిత్రం ‘హాథీ మేరే సాథీ’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌భు సాల్మ‌న్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బ‌డ్జెట్ మూవీ తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వనున్న‌ది. మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించిన‌ ఒక‌ స‌రికొత్త పోస్ట‌ర్‌, మోష‌న్ వీడియో ద్వారా ఈ సినిమా 2021 సంక్రాంతికి విడుద‌ల‌వుతుంద‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ పోస్ట‌ర్‌లో ఒక వైపు ఒక విరిగిన గోడ, రానా, విష్ణు విశాల్ క‌నిపిస్తుండ‌గా, మ‌రోవైపు ఏనుగులు క‌నిపిస్తున్నాయి. వృక్షాలు, అడ‌వుల‌ను సంర‌క్షించ‌మ‌నే మెసేజ్‌ను…