పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లండన్ లో ఇల్లు కొన్నాడన్న వార్త ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు ప్రభాస్. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. లండన్‌లో విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా షూట్స్, వెకేషన్స్ కోసం అక్కడికి వెళ్లినప్పుడల్లా అదే ఇంట్లో ఉండేవారని.. రూ.కోటి వరకు అద్దె చెల్లించేవారని సమాచారం. ఆ ఇల్లు బాగా నచ్చడంతో భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ‘సలార్’తో గతేడాది ప్రేక్షకులను అలరించారు ప్రభాస్. ఎపిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ఇది రూపుదిద్దుకుంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ కోసం వర్క్ చేస్తున్నారు. భారీ బ్జడెట్‌తో సైన్స్ ఫిక్షన్ మూవీగా ఇది తెరకెక్కుతోంది.…