మరో చిత్రం ప్రకటించిన పవన్ కల్యాణ్

pawan kalyan movie in sithara entertainments announced

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అధికారికంగా, విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రతిభావంతమైన యువ దర్శకుడు సాగర్.కె. చంద్రను దర్శకునిగా ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని వివరంగా పొందుపరుస్తూ వినూత్నంగా ఓ వీడియో రూపంలో ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తొలిసారి తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు..’గబ్బర్ సింగ్’ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన నటనతో అశేష ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ మరోమారు పోలీస్ పాత్రలో ఈ చిత్రం ద్వారా రక్తి కట్టించనున్నారు. కాగా ఈ…

జనసేనానితో కిచ్చా భేటీ

Kichha Sudeep meets Power Star Pawan Kalyan

జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ని ప్రముఖ నటుడు, కన్నడ కథానాయకుడు కిచ్చా సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ కార్యాలయానికి సుదీప్ గారు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కి మొక్కలు బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్ వివరించారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే… ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం.