యువ చంద్ర కృష్ణ హీరోగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పొట్టేల్’. అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ( 25, అక్టోబర్-2024) విడుదలయింది. సినిమా విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషన్ పరంగా హడావిడి చేసింది. సినీ ప్రముఖుల ఇళ్లల్లోకి పొట్టేలుని తీసుకొని ప్రచారాన్ని నిర్వహించి సినిమాపై ఎక్కువగానే హైప్ ని క్రియేట్ చేసింది. విజయాన్ని అందుకోవాలని చిత్రసీమకు చెందిన నటీనటులతో సినిమాకు ఆశీర్వాదాలు తీసుకుంది. మరి ఇంత హడావుడి చేసిన ‘పొట్టేల్’ చిత్రం ఏ మేరకు ప్రేక్షకుల మెప్పుని పొందిందో తెలుసుకుందాం… కథలోకి వెళదాం… మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్ ప్రాంతంలోని ఓ ఊర్లో 1970, 80వ దశకంలో ఈ కథ సాగుతుంది. ఆ ఊరి గ్రామ దేవత బాలమ్మకు పుష్కరానికి ఓ సారి జాతర చేసి పొట్టేల్‌ను…