పూర్ణ నటనకు గుడ్ బై చెప్పేస్తోందా!? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది.. ఓ పరి ‘పూర్ణ’మైన అందం గురించి! ఆ అందమే కథానాయిక పూర్ణ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ వైపు టీవీ షోలు.. మరో వైపు వెండితెర. ఇలా రెండు పడవల ప్రయాణం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. టీవీషోల్లో జడ్జీగా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ తన అందంతో చూపరులను ఇట్టే ఆకర్షిస్తూ మంచి క్రేజ్ ని సైతం తెచ్చుకుంటోంది! పూర్ణ అసలు పేరేంటో తెలుసా? షమ్నా ఖాసిం. సినిమాల్లోకి వచ్చాక పూర్ణగా వెలుగుతోంది! అవకాశం ఉన్నప్పుడల్లా తనకు నచ్చి.. అందరూ మెచ్చుకునే పాత్రల ద్వారా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇదిలా ఉంటె.. ఈ ముద్దుగుమ్మ దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి…