బుట్టలమ్మా బుట్టలు అవసరాల గంపలూ అందమైన ఆహార్యంతో కొలువైన వెదురుబుట్టలు బతుకు చిరుగులను అలవోకగా కుట్టిపడేసే హస్తకళానైపుణ్యాలకు తోబుట్టువులు వారసత్వవైభవానికి నిలువెత్తు ప్రతీకలు బహుజన చేతివృత్తుల్లో పురుడోసుకుని వికాసంతో నడక సాగిస్తూ చేతి మునివేళ్లపై నాట్యమాడిస్తూ తీరొక్కరూపంలోకి పరకాయ ప్రవేశంచేసే ఈతకమ్మలు బుట్టల జీవనాడులు బతుకుజీవుని ఆకలిగంప నింపడానికి వెదురుబొంగులతో ఊపిరులూదే నిత్య వేణుగానాలు పుణ్యం గుడిమెట్లెక్కితేనేనా!? బతుకుదారిలో ఎదురయ్యే జీవననైపుణ్యాల్ని కూడా మనిషి పెనవేసుకున్నప్పుడే!!