మంచి కథలను, అంతే మంచి పాత్రలను ఎంచుకుంటూ తెలుగు చిత్రసీమలో తమ కెరీర్ పై దృష్టి సారించే హీరోల్లో నాగశౌర్య ఒకరు. గతంలో వచ్చిన ఆయన చిత్రాలను పరిశీలిస్తే మనకు ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ థియేటర్లలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలకు ముందు రొమాంటిక్ లవ్ కమ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అని మేకర్స్ బోలెడు కహానీలు చెప్పుకున్నారు. ప్రేక్షకుల్లో అంచనాలను పెంచారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఈ శుక్రవారం (మార్చి 17, 2023)న ప్రేక్షకులు ముందుకొచ్చింది. మరి ఈ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.. కథలోకి……