మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో సక్సెస్ ఫుల్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు పై టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న చిత్రం 18 పేజీస్. అర్జున్ సురవరం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నిఖిల్ 18 పేజీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి, వాటితో పాటే తాజాగా చిత్ర బృందం నిఖిల్ కి ఈ సినిమాలో జోడిని కూడా ఎంపిక చేశారు. అటు తన అభినయంతో ఇటు తన అందాలతో తెలుగు కుర్రకారు హృదయాల్ని దోచుకుంటున్న మళయాలీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లుగా 18 పేజీస్ టీమ్ అధికారికంగా ప్రకటించారు. చాలా రోజులు…