-జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రెస్ అకాడమీ చైర్మన్లు కె. శ్రీనివాస్ రెడ్డి , ఆలపాటి సురేష్ -ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల అసోసియేషన్ (డిటిజెఎ) నూతన కమిటీ ఎన్నిక ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయు)కు అనుబంధంగా పనిచేస్తున్న ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల అసోసియేషన్ (డిటిజెఎ) సమావేశం మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాలు లో విజయవంతంగా జరిగింది. అసోసియేషన్ గౌరవాధ్యక్షులు టి.శ్రీనివాస్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ తెలుగు సీనియర్ జర్నలిస్టులు హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (IJU) జాతీయ అధ్యక్షులు, తెలంగాణా ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, గౌరవ అతిథులుగా ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు…
