నూతనంగా ఎన్నికైన తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్ల సంఘం సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గత ఆదివారం నిర్వహించిన ఎన్నికలలో సంఘం అధ్యక్షుడిగా తాత మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా జీ. వెంకట్ రావు, కోశాధికారిగా సతీష్, ఉపాడక్ష్యుడిగా శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ గా బి. కాంతా రెడ్డి (శ్రీకాంత్), ఆర్గనైజింగ్ సెక్రటరీ గా సురేష్ బాబు ఎన్నికయారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో గల సంఘం కార్యాలయం లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి. జి. విందా ,ఫిల్మ్ ఫెడరేషన్ ట్రెజరర్ సురేష్ హాజరై నూతన కార్యవర్గ చేత ప్రమాణ స్వీకారం చేయించి అనంతరం సభ్యులను సన్మానించారు.