‘వీడీ12’ చిత్రానికి ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌!

NTR's voice over for 'VD12'!

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్‌కు 12వ చిత్రం. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ రివీల్‌ చేసేందుకు మేకర్స్‌ డేట్‌ ఫిక్స్‌ చేసిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాణ సంస్థతో పాటు, హీరో విజయ్‌ దేవరకొండ ఈ సినిమా టైటిల్‌, టీజర్‌ను విడుదల చేసే సమాచారాన్ని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ చిత్ర టైటిల్‌, టీజర్‌ విడుదల కానుంది. అయితే ఈ టీజర్‌కు తమిళ్‌లో సూర్య, హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌ వాయిస్‌ ఓవర్‌ అందిస్తుండగా.. తెలుగులో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాయిస్‌ ఓవర్‌ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్‌ దేవకొండ…