తెలుగు నట దిగ్గజం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను దేశ విదేశాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా సాగాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్, టీడీపీ పొలిటికల్ సెక్రటరీ టీజీ జనార్థన్, టీఎఫ్ పీసీ సెక్రటరీ, ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో… నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ – తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ తన ప్రత్యేకత చూపించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని నిరూపించారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని దేశ దేశాల్లో ఘనంగా నిర్వహించుకున్నాం. ఆ సక్సెస్ ను పురస్కరించుకుని ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్నాం.…