గాయనీ గాయకులను, బ్యాండ్స్‌ను వెలుగులోకి తీసుకు రావాలనే గొప్ప ఉద్దేశంతో సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ సోమవారం నాడు ‘డెక్కన్ మ్యూజిక్ ఛాలెంజ్’ కాంపిటీషన్ ప్రారంభించారు. దీనికి ఆయన కుమార్తె ఐశ్వర్య క్రిష్ణప్రియ నిర్మాత. వీళ్ళిద్దరూ కలిసి ప్రారంభించిన ఈ కాంపిటీషన్ సుమారు 12 వారాలు సాగనుంది. ఆ తరువాత 13వ వారంలో ఫైనల్స్ జరగనున్నాయి. ‘డెక్కన్ మ్యూజిక్ ఛాలెంజ్’ ప్రారంభమైన సందర్భంగా శశి ప్రీతమ్ మాట్లాడుతూ ‘‘మన దగ్గర చాలామంది సంగీత కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రజలకు తెలియదు. సినిమాలో గాయనీ గాయకులు ప్రేక్షకులకు తెలుస్తారు. కానీ, వేరే వాళ్ళు బయటకు తెలియదు. గత ఐదేళ్ళుగా రాక్ బ్యాండ్ సంస్కృతి హైదరాబాద్‌లో పెరిగింది. ఇప్పుడు రాక్ బ్యాండ్ ట్రెండ్ అవుతున్నాయి. పబ్స్‌లో వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి. తొలుత ఇంగ్లిష్ పాటలతో ప్రారంభించిన బాండ్స్, పబ్లిక్ డిమాండ్…