తరుణ్ కు మూడు ముళ్లేసిన నెటిజన్లు!

Netizens gave three thorns to Tarun!

యువ నటుడు తరుణ్‌ మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. అయితే కొత్త సినిమా చేస్తున్నాడనే దాని గురించి కాకుండా సామాజిక మాధ్యమాల్లో అతని పెళ్లి సంగతి గురించిజోరుగా చర్చ సాగింది. ఇంతకీ విషయం ఏంటంటే తరుణ్‌ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త బాగా వైరల్‌ అయింది. పెళ్లికూతురు మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల అని వార్త చక్కర్లు కొట్టింది. ఇటీవలే నీహారికి విడాకులు పుచ్చుకున్నారు. ఇంకేముంది ఇద్దరికీ నెటిజన్లు ముడేశాసారు. ఇంతకీ ఈ వార్త ఎవరు మొదలెట్టారు, ఎక్కడ మొదలెట్టారో కానీ బాగా వైరల్‌ అయిపొయింది. పెళ్లివార్త వైరల్‌ కావడంతో చేసేదేముంది పాపం తరుణ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. బాల నటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన తరుణ్‌ లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ తో తెలుగులో చాలా సినిమాలు చేసాడు. విజయాలు సాధించాడు. ఇప్పుడు తరుణ్‌ సినిమాలు…