‘నారి నారి నడుమ మురారి’లో పర్శనల్ గా రిలేట్ అయ్యే క్యారెక్టర్ చేశా ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ : హీరోయిన్ సాక్షి వైద్య

'Nari Nari Nadu Murari' is a full fun entertainer, playing a character that is personally relatable: Heroine Sakshi Vaidya

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సాక్షి వైద్య విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు? -ఏజెంట్ సినిమా జరుగుతున్న సమయంలోనే నిర్మాత అనిల్ గారు నాతో మరో సినిమా చేస్తానని చెప్పారు. ఆయన ప్రామిస్ నిలబెట్టుకున్నారు. ఈ సినిమాలో నిత్య క్యారెక్టర్ కోసం అనిల్ గారు, డైరెక్టర్ గారు నన్ను ఫైనల్ చేశారు. -నిత్య క్యారెక్టర్,…