మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల, జనవరి 25, 2024న థియేట్రికల్ రిలీజ్ హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ కొన్ని రోజుల క్రితం ఆసక్తిని రేకెత్తించే ప్రీ లుక్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఈరోజు ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ప్రతినిధి 2 అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. దీంతో ఇది ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ కానుంది. పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి సంచలన విజయం సాధించింది. యూనిక్ కథ, గ్రిప్పింగ్ కథనంతో అందరి ప్రశంసలు అందుకుంది. ప్రతినిధి 2 కోసం మరింత బిగ్ స్పాన్ వున్న కథను ఎంచుకున్నారు. “One man will stand again, against all odds,” అనేది సినిమా…