కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ ఇంటికి వెళ్లిన నాని

Nani went to Kannada star Shivrajkumar's house

టాలీవుడ్‌ మూవీ లవర్స్‌తోపాటు నాని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హాయ్‌ నాన్న’. శౌర్యువ్‌ (డెబ్యూ డైరెక్టర్‌) డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో న్యాచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్నారు. నాని 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘హాయ్‌ నాన్న’ డిసెంబర్‌ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో నాని అండ్‌ టీం ఇప్పటికే ప్రమోషన్స్‌ లో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఇప్పటికే అభిమానులతో సెషన్‌లో కూడా పాల్గొన్న నాని పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌పై ఫోకస్‌ పెట్టాడు నాని. ఇందులో భాగంగానే కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ ఇంటికెళ్లాడు. ఈ ఇద్దరూ బ్రేక్‌ ఫాస్ట్‌ టైంలో ‘హాయ్‌ నాన్న’ సినిమాలతోపాటు పలు విషయాలపై చర్చించారు. ఇప్పుడీ స్టిల్స్‌…