దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే.., అందమైన కుందానాల బొమ్మరా.., రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా.., పండు వెన్నెల్లో ఈ వెనుగానం అంటూ వచ్చిన పాటలు ఇప్పటికి వినిపిస్తున్నాయంటే ఆ పాటలు ప్రేక్షకుల్నిఎంతగా అలరించియో ఇట్టే అర్ధమవుతోంది. ప్రేక్షకుల మనస్సులో బలంగా నాటుకుపోయిన విధానం అంతా ఇంతా కాదు. ఇవొక్కటే కాదు.. సంపంగి, 6 టీన్స్, జానకి వెడ్స్ శ్రీరామ్, శ్రీ రామచంద్రులు, ప్రేమలో పావనీ కళ్యాణ్, మీ ఇంటికొస్తే ఏమిస్తారు, అవతారం, వైఫ్, అందాల ఓ చిలుక వంటి సినిమాలకు మ్యూజికల్ హిట్ ఇచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంటూ సినిమాతో సంబంధం లేకుండా ఆడియో సూపర్‌హిట్ చేయ్యటమే కాకుండా, ఆ పాటలు అందరూ పాడకునేలా సంగీతాన్ని అందించిన సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ.…