● స్వగ్రామం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మౌనశ్రీ మల్లిక్ కు పౌర సన్మానం ● నేను రూ.250 ● వర్ధన్నపేట ● హైదరాబాద్ నిన్న మా స్వగ్రామం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మనసు నిండా చల్లని పొగమంచు ముసురుకుంది. ఆత్మీయుల నులివెచ్చని స్పర్శతో.. ఒక్కసారిగా 25ఏళ్ల ఒంటరి ప్రయాణం కళ్ళముందు కదలాడి సినిమా రీల్ లా గిర్రున తిరిగింది. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను 250 రూపాయలు పట్టుకుని 1997 డిసెంబర్ 24వ తేదీన హైదరాబాదులో దిగాను. సముద్రంలో నీటి బిందువు పడినట్టుగా ఈ మహానగర జనారణ్యంలో అడుగు పెట్టాను. జీవితంలో ఎంత దుఃఖాన్ని భరించానో, అంత ఆనందాన్ని అనుభవించాను. దుఃఖంలో కుదేలు పడింది లేదు. ఆనందంలో కాలర్ ఎగరేసింది లేదు. ఆనంద విషాదాలను సమదృష్టితో…