భారతీయ తొలి సినిమా పత్రిక విశేషాలు మొదలుకుని ఆ తర్వాత పరిణామ క్రమంలో పనిచేసిన అలనాటి సినీ జర్నలిస్టుల నుంచి నేటి సినీ జర్నలిస్టుల వరకు సమాచారాన్ని శోధించి, సేకరించి సీనియర్ సినీ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన “తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర” పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, “నా కెరీర్ మొదట్నుంచి సినీ రచయితలు, జర్నలిస్టులతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. జర్నలిస్టుల పెన్నుకు ఉన్న పవర్ అంతాఇంతా కాదు. దాని ద్వారా ఎంత మంచి అయినా చెప్పొచ్చు. అయితే ఒక్కోసారి వాస్తవానికి దూరంగా కొందరు జర్నలిస్టులు రాసిన వార్తలు దుమారం సృష్టిస్తుంటాయి. నా మటుకు నేను కూడా కొన్ని వార్తల…