వైవిధ్యమైన కథ, స్క్రీన్ ప్లేతో ఓ సరికొత్త మూవీని సెల్యులాయిడ్ పై ఆవిష్కరిస్తే… ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి… నటీనటులకు, దర్శక నిర్మాతలకు ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాయి. అలాంటి వైవిధ్యమైన కథాకథనాలతో తెరకెక్కిందే సెల్ ఫోన్ బయోపిక్ గా తెరకెక్కిన ‘మాయా పేటిక’. ఇప్పటి వరకు మరం మనుషుల బయోపిక్ చూసుంటాం. కానీ… ఈ ఆధునిక యుగంలో ఏడాది వయసున్న పసిపిల్లల నుంచి డెబ్బై ఏళ్ల వృద్ధుల వరకు అందరూ అడిక్ట్ అవుతున్న ఒకే ఒక డివైజ్ సెల్ ఫోన్. అలాంటి సెల్ ఫోన్ వివిధ రకాల మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది… వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందనేదే ఈ స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్ర కథ విషయానికొస్తే……