మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో పండుగ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. ఇది అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఒకటిగా నిలిచింది. సినిమా ప్రమోషన్లు ఇప్పటికే అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి గ్లింప్స్, పాటలు, పోస్టర్ అంచనాలను పెంచాయి. మేకర్స్ తిరుపతిలో సినిమా థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు. ఒకప్పుడు దేశ భద్రతా సంస్థల్లో కీలకంగా సేవలందించిన శంకర వర ప్రసాద్, శశిరేఖను ప్రేమించి పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కి మారుతాడు. ఫ్యామిలీ మ్యాన్ గా ప్రశాంతంగా కనిపించినా, అతనిలోని వింటేజ్ ఫైర్, నేచురల్ ఇన్స్టింక్ట్ మాత్రం ఎక్కడా తగ్గదు. ఆనందంగా సాగుతున్న అతని జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు వచ్చినప్పుడు, వాటిని శంకర వర…
