3న జరిగే జర్నలిస్టుల మహా ధర్నా విజయవంత చేయండి :విరాహత్ అలీ

Make the journalists' grand dharna on the 3rd a success: Virahat Ali

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 12 సంవత్సరాల కాలంలో అత్యంత నిరాదరణకు గురైన వర్గం జర్నలిస్టులేననడంలో ఎంత మాత్రం సందేహం లేదని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన జర్నలిస్టుల జీవితాలు గత పుష్కర కాలంలో ఏ మాత్రం మెరుగు పడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పొందిన ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు సైతం అందకుండా పోయాయి. నాడు పోరాటాల ద్వారా సాధించుకున్న అనేక వృత్తి సౌకర్యాలు సైతం మాయమైపోయాయి. ఉద్యమ కాలంలోనూ, ఆ తర్వాత పదేళ్ల పాలనలోనూ బీఆర్ఎస్ ఇచ్చిన…