సుమన్-ఆమని విడుదల చేసిన ‘మది’ ట్రైలర్!

madhi Trailer relese

ఆర్.వి.రెడ్డి సమర్పణలో ప్రగతి పిక్చర్స్ బ్యానర్ పై శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నాగ ధనుష్ దర్శకత్వంలో రామ్ కిషన్ నిర్మిస్తున్న సినిమా ‘మది’. ఆర్వి సినిమాస్ సహనిర్మాతలుగా వ్యవహారిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులని అలరించబోతోంది. ఈ చిత్రానికి పి.వి.ఆర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ జరుపుకుంటున్న సందర్బంగా చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధితులుగా వచ్చిన సీనియర్ నటుడు సుమన్, నటి ఆమనిలు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి మండలి శాసన సభ్యులు దయానంద్ గుప్త, కిరణ్, బి. సి. కమీషన్ ఉపేంద్ర, ఫుడ్ కమిషన్ గోవర్ధన్ రెడ్డి, నటి నవీన రెడ్డి, దర్శకుడు జై శంకర్ తదితరులతో పాటు చిత్ర…