లలిత గీతం మూగవోయింది! ప్రముఖ కవి, లలిత సినీ గేయ రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ ఇకలేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కనుమూశారు. ఆయన వయసు 76. ఒక గొప్ప లలిత గీతాల రచయితను తెలంగాణ కోల్పోయింది! రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం ఆయన్ని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. అమెరికా అటా వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లిన ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో జూలై 16న హైదరాబాద్ వచ్చి ఆసుపత్రిలో చేరారు. నెల రోజులు ఆసుపత్రిలోనే ఉండి నాలుగు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. నిన్న మళ్ళీ ఇబ్బంది అనిపించడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. లలిత గీతం ఆగిపోయింది! వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్ల లో చేనేత కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్ నాగోల్ లో స్థిరపడ్డారు.…