నేను ల‌క్ ను న‌మ్మ‌ను క‌ష్టాన్ని నమ్ముతా : ఖిలాడీ ప్రీరిలీజ్‌వేడుక‌లో రవితేజ

khiladi pre relese event

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేష‌న్‌లో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మించారు. డింపుల్ హ‌యాతి, మీనాక్షిచౌద‌రి నాయ‌కిలుగా న‌టించారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్ లైన్‌. హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో ఖిలాడీ ప్రీరిలీజ్‌వేడుక ఘ‌నంగా జ‌రిగింది. బిగ్ టిక్కెట్‌ను బాబీ ఆవిష్క‌రించారు. అనంత‌రం ర‌వితేజ మాట్లాడుతూ, మొద‌టిసారి అన‌సూయ‌, అర్జున్ గారితో చేశాను. అర్జున్‌గారి ఇన్‌స్పిరేష‌న్‌. సినిమా చూస్తే తెలుస్తుంది. టెక్నీషియ‌న్స్ సుజిత్ వాసుదేవ‌న్ అద్భుతంగా చేశాడు. సెకండాఫ్‌లో చాలా…