నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘దసరా’ ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో కీర్తి సురేష్ మీడియాతో దసరా విశేషాలని పంచుకున్నారు. # ‘దసరా’ లో మీ పాత్ర సవాల్ తో కూడుకున్నదిగా అనిపిస్తోంది. మేకప్ కూడా డార్క్ గా వుంది. మీ పాత్ర గురించి…