‘కాంతార’ చిత్రం తెలుగులో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే! రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిపెను తుపానునే సృష్టించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలయి.. నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్కు వచ్చేసింది. కన్నడ నుంచి వచ్చిన ఈ ‘కాంతార’ గొప్ప విజయాన్ని సాధించి వాహ్.. అనిపించింది. ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేశారు. కన్నడతో పాటు.. తెలుగులో కూడా ఈ ‘కాంతార’ చిత్రం మంచి రాబడిని సాధించుకుని ఎన్నో రికార్డుల్ని తన ఖాతాలో వేసుకుంది. సౌత్ ఇండియా సినిమాతో సహా పాన్ ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లు కొల్లగొట్టిన ‘కాంతార’ విమర్శకుల ప్రశంసలు పొందింది. కన్నడ, తెలుగుతో పాటు,…