మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ‘బ్యూటీ’ నుంచి బ్యూటీఫుల్ సాంగ్ ‘కన్నమ్మ’ విడుదల

Beautiful song ‘Kannamma’ released from ‘Beauty’, jointly produced by Maruti Team Product, Vanara Celluloid and Zee Studios

వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వం వహించిన ‘బ్యూటీ’ చిత్రాన్ని అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ‘బ్యూటీ’ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, పాటలు అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ఓ బ్యూటీఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘కన్నమ్మ కన్నమ్మ’ అంటూ సాగే ఈ పాటను సనారే రాయగా.. ఆదిత్య ఆర్కే, లక్ష్మీ మేఘన ఆలపించారు. ఇక విజయ్ బుల్గానిన్…