‘ఉత్తమ సినీ గ్రంథం’గా రెంటాల జయదేవ రచన

Jayadeva's work for two years as 'Best Cinema Book'

‘మన సినిమా… ఫస్ట్ రీల్’ కు తెలంగాణ ప్రభుత్వ ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్ – 2024’ రచయిత, పరిశోధకుడు, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవను తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘గద్దర్ ఫిల్మ్ అవార్డు’ వరించింది. మరుగున పడిపోయిన మన సినీ చరిత్రలోని అనేక అంశాలను తవ్వితీసి, ఆయన రచించిన ‘మన సినిమా… ఫస్ట్ రీల్’ పుస్తకం 2024వ సంవత్సరానికి గాను ‘ఉత్తమ సినీ గ్రంథం’గా ఎంపికైంది. 2024లో వచ్చిన ఉత్తమ చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వ తలపెట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డులలో జయదేవ రచనకు ఈ గౌరవం లభించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల జ్యూరీ గురువారం హైదరాబాద్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ సంగతి ప్రకటించింది. దక్షిణ భారతీయ భాషా…