బేసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ జంటగా విపిన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ సినిమా ‘జయ జయ జయ జయహే’ ఈ మలయాళ సినిమాను 5 నుంచి 6 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు లక్ష్మీ వారియర్, గణేశ్ మీనన్. అక్టోబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 40 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ చిత్ర కథాంశంను పరిశీలిస్తే జయ తెలివైన మధ్యతరగతి అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు కుమారుడి భవిష్యత్ కోసం ఖరీదైన స్కూల్ లో చేర్పిస్తారు. అయితే జయను మాత్రం తన ఆశలకు వ్యతిరేకంగా ఇంటి దగ్గరలో చేరుస్తారు. అందుకే తల్లిదండ్రులపై అప్పుడప్పుడు తిరుగుబాబు చేస్తూ ఉంటుంది జయ. దాంతో చదువు పూర్తి కాకముందే ఆమెకు పెళ్ళి చేయాలనుకుంటారు తల్లిదండ్రులు. పౌల్ట్రీ యజమాని రాజేష్ ను జయకు సరైన వరుడుగా…