సౌత్‌లో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను.. త్వరలోనే చేసే అవకాశం ఉంది : జాన్వీ కపూర్

janvikapoor about mili movie

జాన్వీ కపూర్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మిలి’. మాతుకుట్టి గ్జేవియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘‘ డైరెక్టర్‌గారు స్టోరి చెప్పినప్పుడు మిలి చిత్రంతో నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఉందనిపించింది. రోల్ ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా చూసిన నాన్న చాలా ఎగ్జయిట్ అయ్యారు. నన్ను, తనని తెరపై చూసుకున్నట్లు అనిపించిందని అన్నారు. మా నాన్నగారితో నేను చేసిన తొలి సినిమా. మాతుకుట్టి సార్‌తో కలిసి నటించటం చాలా లక్కీ అనిపించింది. -18 డిగ్రీల టెంపరేచర్‌లో 22 రోజుల పాటు చిత్రీకరించాం. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేయటం చాలా కష్టం. నాన్నగారు నిర్మాతగా ఎలాంటి వ్యక్తో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.…