ఆకట్టుకుంటోన్న ‘ఆకాశం దాటి వస్తావా’ టీజర్!

Impressive 'Akasham Dati Vastava' teaser!

ప్ర‌ముఖ నిర్మాత శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ నుంచి ప్రొడ‌క్ష‌న్ నెం.2గా రూపొందుతోన్న సినిమా `ఆకాశం దాటి వ‌స్తావా`. కొరియోగ్రాఫ‌ర్ య‌ష్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. కార్తీక ముర‌ళీధ‌ర‌న్ హీరోయిన్. శశి కుమార్ ముతులూరి ద‌ర్శ‌కత్వంలో హ‌ర్షిత్‌, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు. 72 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడబోతోన్నట్టుగా అనిపించింది. ఓయ్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్.. ఎప్పుడూ ఇదే పనా? బోర్ కొట్టదా? అంటూ హీరోయిన్ మాట్లాడే మాటలు.. ఎప్పుడూ ఇంతే అందంగా ఉంటావ్.. నీకు బోర్ కొట్టదా? అంటూ హీరో చెప్పే సమాధానంతో టీజర్ మొదలవుతుంది. ‘ఎన్ని సార్లు వస్తావ్ ఇలా?’ అని…